బీజేపీకి సర్వే దెబ్బ.. ఓటమి తప్పదా?

Tuesday, May 1st, 2018, 11:36:20 AM IST

ఎలక్షన్స్ దగ్గరపడుతుంటే నాయకులకు సర్వేల హంగామా కొంచెం కలవపెడుతుండడం సహజం. అయితే ఎక్కువ శాతం వాటి అంచనాల ప్రకారమే దేశంలో పార్టీలు గెలుపొందుతాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల వాతావరణం మొదలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ – బీజేపీ ఎవరి స్టైల్ లో వారు ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా సీ ఫోర్ సర్వే ప్రకారం ఎవరు ఊహించని విధంగా ఫలితాలు వెలువడ్డాయి. అధికార పార్టీ కాంగ్రెస్ కు అక్కడ అనుకూల ఫలితాలు రానున్నట్లు తెలుపడంతో బీజేపీ నేతల్లో కలవరం మొదలైంది.

మొత్తంగా రాష్ట్రంలోని 165 నియోజకవర్గాలుండగా అందులో 24,679 మంది ఓటర్లను సర్వే చేస్తూ.. సీ ఫోర్ ఫలితాలను వెల్లడించింది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ ని ఎవరు ఓడించలేరంటూ.. 2017లో 340 పట్టణాలు, 550 గ్రామాలోని వివిధ వర్గాల వారీనీ సర్వేలో పరీక్షించగా బిజెపికి 60 నుంచి 72 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. ఇక కాంగ్రెస్ 120 నుంచి 132 సీట్ల వరకు దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. ఇక మరో ముఖ్యమైన పార్టీ జేడీఎస్ 20 – 30 సీట్లు దక్కవచ్చని ఇతరులకు 1 నుంచి 7 సీట్ల వరకు గెలవవచ్చని తేలింది.

  •  
  •  
  •  
  •  

Comments