సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలేలా ఉందే!

Tuesday, May 15th, 2018, 09:35:02 AM IST

ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో హోరా హోరి పోటీ కనిపిస్తోంది. మొన్నటి వరకు కాంగ్రెస్ కి పోటీని ఇచ్చే సత్తా బీజేపీ కి లేదు అనే వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఫలితాల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. గెలిచే దిశగా భాజపా ఆధిక్యంలో ఉంది. బెంగళూరు, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించగా.. కర్ణాటక, కోస్టల్ కర్ణాటక సైడ్ ఉన్న నియోజక వర్గాల్లో భాజపా గాలి వీస్తోంది.

ముఖ్యంగా సీఎం సిద్దరామయ్య నియోజక వర్గంలో భారీ తేడా కనిపిస్తోంది. చాముండేశ్వరి ఓటర్లు ఎవరు ఊహించని విధంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందిల. ఎందుకంటే జేడీఎస్ కు చెందిన జీడీ దేవెగౌడ గట్టి పోటీని ఇస్తున్నారు. దాదాపు 10 వేల ఓట్లతో ఆయన ముందుగా ఉన్నారని తెలుస్తోంది. ఇక సిద్దరామయ్య రెండో నియోజకవర్గమైన బాదామిలో కూడా భారీ తేడా కనిపిస్తోంది. అక్కడ బీజేపీ అభ్యర్థు శ్రీ రాములు ఆయనకు గట్టి పోటీని ఇస్తున్నారు.

Comments