ఆఫ్‌ ది పీపుల్‌, బై ది పీపుల్‌, ఫర్‌ ది పీపుల్‌.. సీఎం కౌంటర్

Saturday, May 5th, 2018, 10:42:37 PM IST

కర్ణాటక ఎన్నికల సమరంలో ఎవరు గెలుస్తారో గాని ఎన్నికల్లో ప్రచారంలో మాత్రం రెండు ప్రధాన పార్టీలు సమానంగా వెళుతున్నాయి. కాంగ్రెస్ లోపాలను ఎత్తి చూపిస్తున్న బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతుంటే కాంగ్రెస్ మాత్రం వారి మాటలకు సినిమా డైలాగులతో కౌంటర్ ఇస్తోంది. అంతే కాకుండా సామెతలు పెద్ద పెద్ద కొటేషన్స్ పంచ్ ల రూపంలో వదులుతున్నారు. ఈ నెల 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్‌ పార్టీ పీపీపీకే పరిమితం అవుతుందని చెప్పారు.

ఎందుకంటే.. మొదటి పీ-పంజాబ్‌ని, రెండో పీ-పుదుచ్చేరిని మూడో పీ-పరివార్ (కాంగ్రెస్‌ కుటుంబం) అంటూ మాటలతో ఎద్దేవా చేశారు. పంజాబ్‌, పుదుచ్చేరిల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఉన్న విషయం ఇక మోదీ ఇచ్చిన కౌంటర్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనదైన శైలిలో రీ కౌంటర్ ఇచ్చాడు. ఆ విషయంలో మేమెప్పుడూ విజేతలమే అంటూ ప్రజా స్వామ్యంలో పీపీపీ అంటే.. ఆఫ్‌ ది పీపుల్‌ – బై ది పీపుల్‌ – ఫర్‌ ది పీపుల్‌ అని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అదే విధంగా బీజేపీ మూడు పీపీపీల పార్టీ అని వివరిస్తూ.. పీ-ప్రిజన్ (జైలు), పీ-ప్రైస్‌ హైక్‌ (ధరల పెరుగుదల) పీ-పకోడా (పకోడి) పార్టీ అని పేర్కొన్నారు.