బోణి కొట్టిన బీజేపీ.. తలపట్టుకున్న కాంగ్రెస్!

Tuesday, May 15th, 2018, 10:30:11 AM IST

నిమిషాలు గడుస్తున్న కొద్దీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మొదట ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించిన కాంగ్రెస్ భారత జనతా పార్టీ హావా ముందు తగ్గిపోతూ వస్తోంది. దాదాపు బీజేపీ అధికారాన్ని దక్కించుకునే లెవెల్లో పోటీని ఇస్తోంది. ఎందుకంటే మొదటి విజయం కూడా ఆ పార్టీకే దక్కడం విశేషం. కోటాయాన్ నియోజకవర్గంలో సీనియర్ లిడర్ భారత జనతా పార్టీ అభ్యర్థి ఉమానాథ్ విజయం సాధించాడు. ఈ విషయాన్నీ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మిగతా జిల్లాల్లో కూడా భాజపా తన హవాను గట్టిగా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వరుసగా కొన్ని స్థానాల్లో ఆ పార్టీకి గెలుపు అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బళ్లారిలోని 9 నియోజక వర్గాల్లో పార్టీలో దాదాపు ఆరుగురు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి హవా క్లియర్ గా కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతల ప్లాన్స్ ఈ సారి పెద్దగా పని చేయలేదు అని ఈ రిజల్ట్ ని బట్టి అర్ధమవుతోంది.