కర్నాటక ఎలక్షన్స్: టెన్షన్ మొదలైంది.. మరికొన్ని నిమిషాల్లో రిజల్ట్!

Tuesday, May 15th, 2018, 08:37:47 AM IST

ప్రస్తుతం దేశం మొత్తం కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసమే ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికలు చాలా ముఖ్యం కావడంతో వచ్చే 2019 ఎలక్షన్స్ లో ఎంతో కొంత ప్రభావం చూపగలవు. మెయిన్ గా కాంగ్రెస్ పార్టీకి ఈ రిజల్ట్ చాలా ముఖ్యం. మరో వైపు బీజేపీ కూడా ఈ గెలుపుతో తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇకపోతే మరికొన్ని నిమిషాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా 9 గంటలకు నుంచి సరళి మొదలవుతుంది. 224 నియోజక వర్గాల్లో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

దాదాపు 11 వేల మంది సిబ్బంది ఈ ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు. ఒక్కో టేబుల్ వద్ద 100 మంది ఉంటారు. 2640 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికల పరిశీలకులుగా అశోక్ గెహ్లట్, ఆజాద్ ఉండగా.. బీజేపీ ఎన్నికల పరిశీలకులుగా పీయూష్ గోయల్, జవదేవకర్ నియమించబడ్డారు. దాదాపు మధ్యాహ్న సమయానికి గెలుపెవరిదో తెలిసిపోతుంది. దీంతో పోలీసులు ముందుగానే ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.