కర్ణాటక ఎలక్షన్స్ అప్డేట్స్ : గెలుపెవరిది?

Tuesday, May 15th, 2018, 03:29:05 PM IST

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొత్తం 224 నియోజక వర్గాల్లో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 11 వేల మంది సిబ్బంది ఈ ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు. ఒక్కో టేబుల్ వద్ద 100 మంది పర్యవేక్షకులు ఉంటారు. 2640 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికల పరిశీలకులుగా అశోక్ గెహ్లట్, ఆజాద్ ఉండగా.. బీజేపీ ఎన్నికల పరిశీలకులుగా పీయూష్ గోయల్, జవదేవకర్ నియమించబడ్డారు. దాదాపు మధ్యాహ్న సమయానికి గెలుపెవరిదో తెలిసిపోతుంది. దీంతో పోలీసులు ముందుగానే ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

పార్టీ ఆధిక్యం గెలుపు
కాంగ్రెస్‌ 0 78
భాజపా 0 104
జేడీ(ఎస్‌)+ 0 38
ఇత‌రులు 0 2