బీజేపీని కలవరపెడుతోన్న సర్వే!

Saturday, May 12th, 2018, 11:27:12 PM IST


ఎన్నికలు ఎలా జరుగుతాయి ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ కన్నా నాయకుల్లో ఎక్కువగా సర్వేల దడ ఆందోళనకు గురి చేస్తుంది. ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి సర్వేల ప్రభావం చాలానే పనిచేస్తుంటుంది. ఇక ఇటీవల వచ్చిన ‘పీపుల్స్‌ పల్స్‌’ సర్వేల వివరాల ప్రకారం అధికారంలో ఉన్న పార్టీనే మళ్లీ అధికారం దక్కించుకునే విధంగా సీట్లను గెలుచుకుంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ కు 93 -103 వరకు సీట్లు దక్కవచ్చని సమాచారం.

కన్నడ ప్రముఖ దిన పత్రిక కోలర్‌వాణి అనుసంధానంతో ఏప్రిల్‌ 27వ తేదీ – మే 9వ తేదీ మధ్య కాలంలో నిర్విరామంగా నిర్వహించిన సర్వే ప్రకారం ఈ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలు తిరిగి డిసైడ్ చేసిన ఈ సర్వేలో బీజేపీ 93 వరకు సీట్లను దక్కించుకోవచ్చని తెలుస్తోంది. ఇక ఆ తరువాత ఎప్పటిలానే జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీ ఇతరులు తరువాత స్థానాల్లో నిలుస్తారని తేలింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.