ఫైనల్ ఎలక్షన్ రిపోర్ట్ : కింగ్ మేకర్ జేడీఎస్.. ఏం జరుగుతుందో?

Tuesday, May 15th, 2018, 05:37:30 PM IST

కర్ణాటక ఎలక్షన్ లో ఫైనల్ రిపోర్ట్ వచ్చేసింది. ఈ నెల 12న 222 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఫైనల్ గా ఈ రోజు వెలువడిన ఫలితాల్లో బీజేపీ 104 స్థానాలను అందుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 112 స్థానాలను అందుకోలేకపోయింది. కాంగ్రెస్ 78 స్థానాలను గెలుచుకోగా జనతా దళ్ సెక్యులర్ పార్టీ 38 స్థానాలను అందుకొని మూడవ స్థానంలో నిలిచింది. ఇతరులు 2 స్థానాలను అందుకున్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ ఎవరికీ దక్కపోవడంతో దేశంలో ఈ ఎన్నికలపై మరింత ఆసక్త్తి పెరిగింది.

ఫైనల్ గా కాంగ్రెస్ ఓడినప్పటికీ భారత జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని ఇవ్వకూడదని డిసైడ్ అయ్యింది. అవసరం అయితే జేడీఎస్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. 38 స్థానాలను గెలుచుకున్న జేడీఎస్ కు మద్దతు ఇస్తే మ్యాజిక్ ఫిగర్ దాటినట్టే. అధికారానికి కావలసిన స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. బీజేపీ కి ఎంత మాత్రం ప్రస్తుతం జేడీఎస్ మద్దతుగా లేదు. దీంతో కాంగ్రెస్ కూటమితో ఆ పార్టీ అధికారంలోకి రావాలని డిసైడ్ అయ్యింది. అయితే ఇందులొ చాలా కిటుకులు ఉన్నాయి.

సీఎం పోస్ట్ ఎవరికీ ఇవ్వాలనే నిర్ణయం ఫైనల్ గా గవర్నర్ చెప్పాలి. గత రాజ్యాంగ నియమాల గురించి ప్రస్తావిస్తే ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీకి అధికారం ఇవ్వాల్సి ఉంటుంది. అలా జరిగితే బీజేపీలకి అధికారం అందుతుంది. ఎన్నికలకు ముందు ఒకటై పోటీ చేసిన కూటములకు మాత్రమే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ కాంగ్రెస్ జేడీఎస్ విడివిడిగా పోటీ చేశాయి. ఫలితాల తరువాత ఇరు పార్టీలు ఒకటి కాబోతున్నాయి.ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేల జేడీఎస్ ఎవరు ఊహించని విధంగా బీజేపీకి మద్దతు పలికితే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. మొత్తంగా చివర వరకు ఏం జరుగుతుంది అనే విషయం ఎవ్వరికి తెలియదు. మరి గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments