భాగ్యనగరిలో కన్నడ రాజకీయం.. భాజాపాకు భయపడ్డారా..?

Friday, May 18th, 2018, 11:47:04 AM IST

కర్ణాటక రాష్ట్ర రాజకీయ రోజురోజుకూ రసవత్తరంగా మారుతుంది, కన్నడ నాయకుల రాజకీయ చదరంగాన్ని చూస్తుంటే ఒక్కోసారి నవ్వాలో లేక జాలి చూపాలి కూడా అర్థం కావడం లేదు. రాష్ట్ర గవర్నర్ సీఎం పదవిని భాజాపా పార్టీ నాయకునికి కట్టబెట్టగా తాము బలనిరూపణ చేసుకోవడానికి 15 రోజుల సమయం కేటాయించింది. ఇదే తరుణంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ భాజాపాలో కలుస్తారా అని ఆ పార్టీ నాయకులు భయాందోళనలో పడ్డారు.

ఇప్పటికే భాజాపా కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు కట్టు కథలు చెప్తూ, వారి వైపుకు లాక్కునేలా ప్రయత్నాలు చేస్తున్నారని, దీని విషయంలో భాజాపా పెద్ద కుట్ర పన్నుతుందని ఆరోపణలు కూడా చేసారు, ఈ నేపథ్యంలో వారికి పోలీసుల రక్షణ కూడా కావాలని డిమాండ్ చేయగా అధికారంలో లేనందున కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు పోలిస్ రక్షణ కల్పించలేకపోయింది. దీనితో ఏం చేయాలో అర్థం కాక ఇరు పార్టీల నేతలను ఈగల్టన్ రిసోర్టుకు తీసుకుపోగా అక్కడ కూడా వారికి రక్షణ లేదని కలత చెందారు. చివరికి చేసేది ఏమీ లేక అందరు ఎమ్మెల్యేలను కేరళకు తరలించాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్, జేడీఎస్ అధినేతలు పౌర విమానయాన శాఖను సంప్రదించింది. వీళ్ళ టీం బ్యాడో లేక ఇంకేంటో ఎవరికీ తెలియదు కానీ విమాన సేవ అందించడానికి కూడా పౌరవిమానయాన శాఖవారు తిరస్కరించడంతో చివరి నిమిషంలో కొందరు ఎమ్మెల్యేలను నిన్న రాత్రి, ఇంకొందరు ఎమ్మెల్యేలను ఈ రోజు ఉదయం హైదరాబాద్ కి తరలించారట. అది కూడా కర్నాటక నుంచి ఒక ప్రత్యేక బస్సును పెట్టి కట్టుదిట్టమైన ప్రైవేటు సెక్యురిటీ సిబ్బందిని రక్షణగా పెట్టి హైదరాబాద్ కు తరలించారు.

పప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలను ఎక్కడ ఉన్చారన్నది రహస్యంగా ఉంచాలనుకున్న అందరూ కలిసి కట్టుగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని ఆలోచించి జేడీఎస్ ఎమ్మెల్యేలను నోవాటేల్ హోటల్ కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తాజ్ కృష్ణా హోటల్ కు తరలించారు. ప్రస్తుతం కర్ణాటక ఎమ్మెల్యేలు నివాసం ఉంటున్న హోటల్ల వద్ద కట్టు దిట్టమైన హైదరాబాద్ పోలీసుబలగాలతో రక్షణ చేపట్టగా ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టాలన్న భాజాపా ఎత్తులు మాపై సాగానీయం, కచ్చితంగా మా ఎమ్మెల్యేలను మేము సురక్షితంగా కాపాడుకుంటామని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు వెల్లడించాయి.

  •  
  •  
  •  
  •  

Comments