కర్ణాటక రాజకీయాల్లో పదవుల కోసం కొట్లాట!

Monday, June 4th, 2018, 11:33:17 PM IST

ఈ ఏడాది దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కర్ణాటక ఎన్నికలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. బీజేపీ అధికారం దక్కించుకుందామని వేసిన ప్లాన్స్ ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. సగం స్థానాలను కూడా అందుకొని జేడీఎస్ లక్కుతో అధికారాన్ని అందుకుంది. కాంగ్రెస్ తప్పని పరిస్థితుల్లో మద్దతు ఇచ్చి బిజెపికి అవకాశం అనేదే లేకుండా చేసింది. అయితే బీజేపీ చెప్పినట్టు పొత్తులను కొనసాగించడం అంత ఈజీగా కాదని మంత్రి విస్తరణలో తప్పకుండా చిక్కులు వచ్చిపడతాయని కామెంట్స్ చేసింది.

అయితే బీజేపీ చెప్పనట్టుగానే కాంగ్రెస్ – జేడీఎస్ నేతల్లో అంతర్యుద్ధాలు మొదలవుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిని జేడీఎస్ కి ఇచ్చిన కాంగ్రెస్ మంత్రి పదవులను మాత్రం తనకు ఇష్టం వచ్చినట్లు తీసుకుంటోంది అని అప్పుడే టాక్ వచ్చింది. ఇక జేడీఎస్ కుమార స్వామి సోదరుడు రేవణ్ణ మంత్రి పదవుల విషయంలో మొండి పట్టుపట్టడం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కీలకమైన పీడబ్ల్యూడీ, విద్యుత్ శాఖలు రెండు పదవులు తనకే ఇవ్వాలని రేవణ్ణ సొంత ఓజెడిఎస్ నేతలపైనే తిరగపడుకుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు అవి ఎంత మాత్రం ఇవ్వమన్నప్పటికీ రేవణ్ణ రాహుల్ గాంధీతో మాట్లాడి మరి సెట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కుమారస్వామి ఎంత చెప్పినప్పటికీ రేవణ్ణ వినడం లేదట. దేవగౌడ కూడా ఈ విషయంలో చేతులెత్తేయడంతో కాంగ్రెస్ నేతలే తగ్గారని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments