కర్ణాటక బల పరీక్ష టెన్షన్ మొదలైంది!

Saturday, May 19th, 2018, 10:37:42 AM IST

కర్ణాటకలో అధికారాన్ని అందుకునేది ఎవరో గాని నాయకుల మధ్య అధికార గొడవలు తార స్థాయికి చేరుతున్నాయి. నేడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో కర్ణాటక కింగ్ ఎవరో దాదాపు తెలిసిపోతుంది. గెలిచినా శాసన సభలో నాయకుల ప్రమాణ స్వీకారం తరువాత ప్రొటెం స్పీకర్‌ నేతల మధ్య బల పరీక్షను నిర్వహిస్తారు. ముందుగా బలపరీక్షకు 15 రోజుల వరకు గవర్నర్ సమయం ఇవ్వగా సుప్రీం కోర్టు కలుగజేసుకొని శనివారం సాయంత్రం లోపు ఫైనల్ చేసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. దీంతో ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశ సభ ప్రారంభం కానుంది.

అనంతరం స్పీకర్ నాయకుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక సరిగ్గా 4 గంటల సమయంలో బలపరీక్ష నిర్వహించిన తరువాత పరిస్థితి ఓ కొలిక్కి వస్తుంది. రహస్య ఓటింగ్ నిర్వహించాలని అనుకున్నప్పటికీ సుప్రీమ్ కోర్టు అభ్యంతరం చెప్పడంతో సభ్యుల వారీగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారు అలాగే వ్యతిరేకులను లెక్కించడం జరుగుతుంది. మొత్తం 224 శాసన సభ సీట్లున్న కర్ణాటకలో 222 స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. 111 మద్దతు దారులు ఉన్న పార్టీ అధికారాన్ని అందుకుంటుంది. బీజేపీ నాయకులను ఆకర్షిస్తుందని ముందుగానే జేడీఎస్ – కాంగ్రెస్ నేతలు గెలిచినా నాయకులను హైదరాబాద్ కు తరలించిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments