కూల్ గాముగిసిన కర్ణాటక పోలింగ్.. కానీ అక్కడక్కడా..

Sunday, May 13th, 2018, 12:06:13 AM IST

కర్ణాటక ఎలక్షన్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం రిజల్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం స్టార్ట్ చేసింది. అంతే కాకుండా బీజేపీ ని గట్టి దెబ్బ కొట్టాలని అనుకుంటోంది. వరుస ఓటముల నుంచి కర్ణాటక కాంగ్రెస్ కు ఎంత వరకు విజయాన్ని అందిస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఐకపోతే ఎన్నికలు అంతంత మాత్రంగానే సాగాయి. సెలబ్రెటీలు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ప్రజలు మాత్రం పెద్దగా పాల్గొనలేదు. అక్కడక్కడా నేతల మద్యన కొట్లాటలు కుమ్ములాటలు కొంత ఆందోళన కలిగించాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ లో దాదాపు 70% ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల మిషెన్లు మొరాయించాయి. ఇకపోతే మరో చోట పాము రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేఆర్‌పురం నియోజక వర్గంలో ఎవరు ఊహించని విధంగా ఓ పోలింగ్‌ బూత్‌లోకి పాము ప్రవేశించి ఓటర్లను భయానికి గురి చేసింది. దీంతో పోలీసులు దాన్ని బయటకు తరలించారు. రెండు మూడు ఘటనలు తప్పితే పోలింగ్ మొత్తం సవ్యంగానే సాగింది.

  •  
  •  
  •  
  •  

Comments