షాకింగ్ న్యూస్ : కర్ణాటక రాజకీయాల్లో స్పీకర్ కీలక పాత్ర

Saturday, May 19th, 2018, 03:29:14 AM IST

గంట గంటకీ కర్ణాటక ఱాఆఃట్ఱేఆ సీఎం పదవికి సంబంధించి అంశం ఇతి కాంగ్రెస్, జేడీఎస్, అటు భాజాపా నేతలును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ప్రజలకు ఎప్పుడు ఏం కొంప మునుగుతుందా, ఎవరు తమ రాష్ట్ర సీఎం అవుతారా అని అయోమయంలో పడుతున్నారు. ఉన్నట్టుండి రేపటి లోపు భాజాపా తమ బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించగా ప్రస్తుత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప నిలబడతారా, లేక పడిపోటారా అన్న విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. రాష్ట్రంలో తమకు మెజారిటీ ఉందంటే మాకు ఉందని అటు కాంగ్రెస్, జేడీఎస్ ఇటు భాజాపా పోటా పోటీన కయ్యానికి కాలు దువ్వేలా తయారవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర శాసన సభ స్పీకర్ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం అందింది. కర్ణాటక రాష్ట్రానికి 8 సార్లు స్పీకర్ గా ఎన్నికైన ఆర్వీ దేశ్ పాండేను పోట్రేం స్పీకర్ గా అసెంబ్లీ సెక్రటరియెట్ నియమించింది. అంతేకాకుండా ఆ స్పీకర్ కాంగ్రెస్ నేత అయి ఉండటంవల్ల రేపటి బలనిరూపిత పరీక్షలో స్పీకర్ ముందుంది అన్నీ నడిపిస్తూ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాడని వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భాజాపా 112 ను చేరుకోవాలంటే ఎట్టిపరిస్థితుల్లో వారికి 8 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఇప్పుడు భాజాపా 104 స్థానాలు గెలుపొంది ఉండటం వాళ్ళ భాజాపాకు స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం కూడా లేదు. ఇలాంటి సమయంలోనే రాజ్యంగ చట్టం ప్రకారం స్పీకర్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు భాజాపా ఒక స్పీకర్ ని నిలబెడితే జేడీఎస్, కాంగ్రెస్ కూడా వాళ్ళ తరుపు అభ్యర్థిని నిలబెడతాయి. అప్పుడు గనక భాజాపా ఓడిపోతే బలనిరూపణ జరగక ముందే ఓటమిని చేవిచూసినట్టవుతుంది. అలా జరిగితే ఇక యెడ్యూరప్ప సీఎం పదవి నుండి కచ్చితంగా విరమించ వలసి వస్తుంది. కానీ భాజాపాకు ప్రస్తుత స్పీకర్ తప్ప వేరే మనిషితో బలపరీక్ష చేయించుకునే చాయిస్ లేదు.
అన్ని స్పీకర్లకు ఉన్నట్టు పోత్రేం స్పీకర్ కు కూడా సర్వ హక్కులు ఉంటాయి. ఈ తరుణంలో ఏ ఇతర ఎమ్మెల్యే అయినా ఫిరాయింపులకు పాల్పడినట్టు తెలిస్తే ఇక ప్రతిపక్ష పార్టీలకు వెంటనే ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది. అలా జరిగితే స్పీకర్ కు ఎమ్మెల్యేలపై ఓటు వేసే చాన్సు వస్తుంది. ఎన్ని విధాలుగా చూసినా కూడా భాజాపా తమ బలపరీక్ష నిరూపణ చేసుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. దేశం అంతటా గుబులు పుట్టిస్తున్న ఈ సీఎం సంగతి ఏమవుతుందా అన్న విషయం రేపు తేలాల్సి వుంది.