కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళన.. వివరణ ఇచ్చిన కనిమొళి!

Saturday, July 28th, 2018, 03:27:52 PM IST

94 ఏళ్ల డీఎంకే అధినేత ఎంకే కరుణానిధి ఆర్యోగ్యంపై ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒక రోజు బాగానే ఉన్నారని చెప్పి మరోసారి హుటాహుటిన ఆస్పత్రికి తరలించడం వైరల్ అవుతోంది. మీడియాల్లో కొన్ని కథనాలు కూడా అన్నా డీఎంకే కార్యకర్తల్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. రీసెంట్ గా కావేరీ ఆస్పత్రికి చాలా మంది రాజకీయ నాయకులు మీడియా ప్రతినిధులు వచ్చారు. నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతతో ఉన్న కరుణానిధి అదే ఆస్పత్రిలో ఎమర్జెన్సీ అని హడావుడి చేశారు. అయితే నేడు ఆయన కుమార్తె కనిమొళి ఆస్పత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎవరు గంగారుపడాల్సిన అవసరం లేదని రెండు మూడు రోజుల్లో నాన్న గారు పూర్తిగా ఆరోగ్యంతో ఇంటికి వస్తారని ఆమె తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments