ఐపీఎల్ లో అందరిచూపు అతనివైపే.. నైట్ వాచ్ మెన్!

Thursday, April 5th, 2018, 05:07:48 AM IST

క్రికెట్ అంటే ప్రస్తుతం మనిషిలో మరో భాగమైంది. భారతదేశంలో ఏ నలుమూలల చూసిన క్రికెట్ ను ప్రేమించని వ్యక్తి ఉండడు. అయితే ఐపీఎల్ వచ్చిన తరువాత ఆ డోస్ కొంచెం ఎక్కువైపోయింది. అలాగే క్రికెట్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. టీ20 ఫార్మాట్ సరికొత్త అనుభూతిని ఇవ్వడంతో ఆ మ్యాచ్ లను అందరు ఎంతో ఇష్టంగా చూస్తున్నారు. అలాగే యువకులకు కూడా ఐపీఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది. భారత జట్టులో అవకాశం అందుకోవాలంటే ఐపీఎల్ చాలా హెల్ప్ అవుతోంది. ఈ ఏడాది కూడా చాలా మంది యువ క్రికెటర్లు ఐపీఎల్ లో అడుగుపెట్టబోతున్నారు.

అయితే పంజాబ్ తరపున ఆడనున్న జమ్మూ కాశ్మీర్ ఆటగాడు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పుడు అందరు ఆసక్తిగా అతని ఆట ఎలా ఉండబోతోందా అని ఎదురుచూస్తున్నారు. గత 2016-17లో అంతరాష్ట్ర టీ20 టోర్నమెంట్‌లో జమ్మూ కశ్మీర్‌ జట్టుకు ఆడిన కుర్రాడు మంజూర్‌ దార్. మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన ఈ కుర్రాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మంచి క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బంతిని బలంగా కొట్టగల సమర్ధుడు. ఇప్పటి వరకు 145స్ట్రైక్‌రేట్‌ తో తొమ్మిది టీ20 మ్యాచ్‌లాడాడు.


ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. పేద కుటుంబం కావడంతో మంజూర్‌ దార్ రాత్రి వాచ్ మెన్ గా జాబ్ చేసి ఉదయం క్రికెట్ ఆడేవాడు. ఇంట్లో నలుగురు చెల్లెల్లు ముగ్గురు తమ్ముళ్లు. పెద్దవాడు కావడంతో అన్ని తానై చూసుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో అతన్ని పంజాబ్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో మంజూర్‌ దార్ ఆత్మ విశ్వాసం పెరిగింది. ఎలాగైనా ఈ ఐపీఎల్ లో తనను తాను నిరూపించుకోవాలని కసిగా ఉన్నాడు. ధోని హెలికాఫ్టర్ షాట్ ఎలాగైనా ట్రై చేస్తానని చెబుతోన్న ఈ హార్డ్ హిట్టర్ ఎంతవరకు రాణిస్తాడో చూడాలి. రాణించాలని మనం కూడా కోరుకుందాం.

  •  
  •  
  •  
  •  

Comments