ప్రేమ కోసం ఏకే – 47 పట్టుకున్నాడు.. కానీ?

Monday, April 30th, 2018, 05:40:34 PM IST

ప్రేమించిన యువతీ కోసం కొందరు యువకులు చేసే పనులు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వేరే వ్యక్తితో ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతుంటే ఏం చేయాలో తెలియక చాలా వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతుంటారు. రీసెంట్ గా ఒక యువకుడు ఏకంగా ఆర్మీ ఆఫీసర్ స్టైల్ లో వెళ్లి తన ప్రేయసికి నిశ్చయించిన పెళ్లి కొడుకును బెదిరించాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకుంది.

అసలు వివరాల్లోకి వెళితే.. అదిల్ అనే యువకుడు గత కొంత కాలంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎలాగైనా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకొని జీవించాలని అనుకున్నాడు. కానీ సడన్ గా అమ్మాయి ఇంట్లో వారు వేరే అబ్బాయితో తనకు పెళ్లి నిశ్చయించగా అదిల్ తట్టుకోలేకపోయాడు. పెళ్లిని చెడగొట్టాలని ప్లాన్ వేసుకున్నాడు. తన ముగ్గురి స్నేహితులతో కలిసి ఆర్మీ అధికారుల లాగా ప్రేయసి ఇంటికి వెళ్లాడు. అక్కడ పెళ్లి కొడుకుని ఏకే-47 గన్స్ తో బెదిరించాడు. అయితే గన్నులను చుసిన కుటుంబ సబ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే గట్టిగా ఆరా తీయడంతో సెకన్లలో నిజం బయటపడింది.

వారు తెచ్చిన గన్నులు డమ్మివని తెలియడంతో వారిని పట్టుకొని చితకబాధగా తోటి స్నేహితులు పారిపోయారు. అదిల్ ఒక్కడు వారికి చిక్కాడు. పోలీసులకు సమాచారం అందించడంతో అతను కేవలం ప్రేయసి కోసమే ఈ తరహాలో నాటకమాడినట్లు రుజువు చేసి వదిలిపెట్టారు. మరి అమ్మాయి కుటుంబ సభ్యులు అతనితో పెళ్లికి ఒప్పుకుంటారా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments