ఎన్నికల్లో పోటీచేస్తానంటున్న కత్తి !

Sunday, September 30th, 2018, 04:06:09 PM IST

సినీ విమర్శకుడు గా ప్రేక్షకులకు పరిచయమైన కత్తి మహేష్ ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వివాదాస్పద వాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచారు. అయితే గత కొద్దీ రోజులుగాపవన్ ఫై విమర్శలను ఆపేసిన కత్తి మళ్ళీ మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పర్యటనలో వున్నా ఆయన మీడియాతో మాట్లాడారు.

దళిత జాతికి రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని కొత్త దళిత న్యాయం కోసం జిల్లాల పర్యటన చేస్తున్నానని అన్నారు. అలాగే ఇటీవల జరిగిన హత్యలు పరువు హత్యలు కాదని కుల ఉన్మాద హత్యలు అని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈసందర్బంగా వివరించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రతి విషయంలో వెనుకడుగు వేయడం అలవాటుగా మారిందని కత్తి మహేష్ విమర్శించారు.