క్రిటిక్ కత్తి మళ్ళీ వచ్చాడు… కానీ రీకౌంటర్లలో చిక్కుకున్నాడు

Tuesday, March 13th, 2018, 08:41:11 PM IST

ఒకప్పుడు కట్టి మహేష్ అంటే చాలా మందికి తెలియదు, కానీ బిగ్ బాస్ షో ద్వారా చాలా మందిలో గుర్తింపు తెచ్చుకొని మంచి సినీ క్రిటిక్ గా ఎదిగాడు. అయితే మహేష్‌కి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అభిమానులకు మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలు ఉద్రిక్తస్థాయికి వెళ్లాయి. మధ్యలో సడెన్‌గా వీరివురి మధ్య సయోధ్య కుదిరింది. అయితే కొంత కాలంగా సంయమనం పాటించిన మహేష్ మళ్లీ పవన్‌పై కత్తి దూయడం మొదలు పెట్టారు. ఈ మధ్యలో యాంటీ క్రిటిక్, రచయిత విజయ నగేష్ సీన్‌లోకి వచ్చారు. మహేష్ కౌంటర్‌కి సూపర్ ఫాస్ట్‌గా.. అది కూడా పులి జింకను పట్టే రేంజి స్పీడ్ లో రిప్లై ఇవ్వడం మొదలు పెట్టారు. చాలా రోజుల తర్వాత మహేష్ పవన్‌పై సంచలన ట్వీట్ చేశారు. ‘‘జనసేన పార్టీ ఆరంభంలోనే బానిసత్వం ఉంది. పవన్ కల్యాణ్ రాజకీయ పంథాలోనే జీహుజూరి ఉంది. పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి ఉంది. ఇది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదు.. ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజం’’ అంటూ మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి కొద్ది నిమిషాల్లోనే నగేష్ నుంచి భారీ ఎన్‌కౌంటర్ వచ్చేసింది.

‘‘వినాశకాలే విపరీత ట్వీట్లు.. మిడిసిపాటుకు తప్పదు భంగపాటు. ఈ ఉన్మాదానికి పాడాలి చరమగీతం. వేలకోట్ల జగన్ అవినీతి కనిపించని వైసీపీ కత్తి మహేష్‌కి జనసేన విషయంలో అవినీతి ఆధారం చూపిన మరుక్షణం నా ట్విట్టర్ ఎకౌంట్ డిలీట్ చేస్తా.. కత్తి అనుచరుడిగా మారిపోతా’’ అని ట్విట్టర్ ద్వారా మహేష్‌కి రీకౌంటర్ ఇచ్చారు. ఈ ఒక్కటే కాదు. ఈ మధ్యకాలంలో మహేష్ ఏ ట్వీట్ పెట్టినా దానికి క్షణాల్లో నగేష్ నుంచి కౌంటర్ ల మీద కౌంటర్ లు పడుతున్నాయి. ప్రస్తుతం కత్తి ట్వీట్స్‌కి ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయనకు రివర్స్ కౌంటర్ ఇస్తున్న నగేష్‌కి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments