పరిపూర్ణానంద స్వామిపై కూడా బహిష్కరణ వేటు.. ఖండించిన కత్తి!

Wednesday, July 11th, 2018, 01:08:02 PM IST

ఇటీవల కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు గాను హైదరాబాద్ పోలీసులు అతనిపై నగర బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. అలాగే శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి కూడా నగర బహిష్కరణకు గురయ్యారు. ఆరు నెలల వరకు అనుమతి లేకుండా నగరంలో అడుగుపెట్టనివ్వకూడదు అంటూ కత్తి మహేష్ కి విధించిన వేటూనే ఆయనపై కూడా వేశారు. అయితే కత్తి మహేష్ ఈ విషయంపై ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ చేశాడు.

తన ఫెస్ బుక్ ఎకౌంట్ ద్వారా కత్తి మహేష్ ఈ విధంగా స్పందించాడు. , “పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు. బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. “మనుషుల్ని తప్పిస్తే సమస్యలు తప్పుతాయి” అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది” అని పేర్కొన్నాడు.

ఇక అంతకుముందు చేసిన ఒక పోస్ట్ లో అంబేద్కర్ రాసిన రాజ్యాన్ని నమ్మాను అంటూ.. రాజ్యం రాజ్యాంగాన్ని పలుచన చేసినా. విచారణ లేకుండా శిక్ష వేసినా. సమన్యాయం లేకుండా అన్యాయం చేసినా. ఇంకా వ్యవస్థలపై నాకు నమ్మకం ఉంది. ఎంత అన్యాయం జరిగినా న్యాయంగా పోరాడటమే నా పంథా. నాకు అంబేద్కర్ మహాశయుడు నేర్పింది అదే. ఓడినా, గెలిచినా,ప్రాణాలు పోయినా పోరాటం ఆగదు. అని కత్తి మహేష్ తన వివరణను ఇచ్చాడు.

  •  
  •  
  •  
  •  

Comments