జగన్ పై జరిగిన హత్యాయత్నం మీద “కత్తి మహేష్” సంచలన వ్యాఖ్యలు.!

Thursday, November 1st, 2018, 06:15:42 PM IST

తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ తర్వాత కత్తి మహేష్ అనే పేరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనం గా మారిపోయింది.తర్వాత కొద్ది నెలలు ఆ సంచలనం అలా కొనసాగుతూనే వచ్చింది.సినీ విమర్శకుడిని అంటూ చెప్పుకొని రాజకీయ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఆఖరికి మత సంఘాల జోలికి వెళ్లి ఖంగుతిని కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్నాడు.మళ్ళీ ఇన్నాళ్ళకు కత్తి మహేష్ నోరు విప్పాడు.అది కూడా సంచలనానికి దారి తీసిన జగన్ పై జరిగిన హత్యాయత్నం పై తన స్పందనను తెలియజేశాడు.

జగన్ పై జరిగిన ప్రయత్నం తనకి పెద్దగా షాక్ అయ్యే విషయంలా కనిపించలేదని కానీ అతని మీద జరిగిన దాడిపై జనాలు,రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపాడు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు అతని పార్టీ యొక్క ఎంపీలు జగన్ కు జరిగిన దాడి పట్ల కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి కూడా పరామర్శించలేకపోయారా అని ప్రశ్నించారు.చంద్రబాబు ఇంత దిగజారుడు చర్యకు పాల్పడతారని అనుకోలేదు అని తెలిపారు.

అంతే కాకుండా జగన్ పై టీడీపీ ఎంపీ రాజేంద్రప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలపై అతను మనిషా వింత జంతువా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.దాడికి పాల్పడిన శ్రీనివాస్ ను మొదటి రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నపుడు నవ్వుతు కనిపించాడని ఆ తర్వాత కొద్ది రోజులకి అతని పరిస్థితి ఎంత అద్వానంగా ఉందో అని అతన్ని ఏ రకంగా విచారణ చేస్తున్నారని ప్రశ్నించారు.