“కౌశల్ ఆర్మీ” దెబ్బకు మహేష్ రికార్డే ఔట్..!

Tuesday, October 9th, 2018, 12:02:45 AM IST

కౌశల్ ఈ పేరు ఇప్పుడు ఒక సంచలనం.బిగ్ బాస్ అనే ఒక్క షో తో తన దశ తిరిగిపోయిందనే చెప్పాలి.అంతకు మునుపు ఎన్నో చిత్రాల్లో నటించినా సరే రాని గుర్తింపు ఈ ఒక్క షో తో వచ్చింది .అది కూడా ఊరికనే ఏం రాలేదు కౌశల్ తనదైన స్వభావంతో,ఇంతటి ఆదరణను సొంతం చేసుకున్నాడు.తన విజయానంతరం తన కి స్ఫూర్తినిచ్చింది అండగా నిలిచింది పవన్ మరియు మహేష్ లే అని తెలిపాడు.ఐతే ఇప్పుడు ఒక తాజా అంశం చర్చనీయాంశం అయ్యింది.

ఇటీవలే టాలీవుడ్ అమ్మాయిల కలల రాకుమారుడు,సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కౌశల్ గెలుపు పట్ల తన శుభాకాంక్షలను తన ట్విట్టర్ వేదికగా తెలిపారు.ఇప్పుడు ఆ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటి వరకు మహేష్ పెట్టిన ట్వీట్లలో అత్యధిక మంది లైక్స్ చేసిన ట్వీట్లలో ఒకటిగా గా అది నమోదయ్యిపోయింది.ఆ ట్వీట్ కు గాను కౌశల్ ఆర్మీ ఎంతగా స్పందించారంటే..అప్పటి వరకు టాలీవుడ్ లో అత్యధిక లైక్స్ సంపాదించిన మహేష్ యొక్క “మహర్షి” చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ 69 వేల లైక్స్ తో రికార్డు సృష్టించింది.ఇది కూడా మహేష్ ట్వీట్లలో రికార్డే.ఇప్పుడు అసలు కనీసం ఒక్క ఫోటో కూడా పెట్టకుండా కేవలం కౌశల్ కు శుభాకాంక్షలు తెలిపిన ట్వీట్ కే 70 వేలు లైక్స్ తో మహేష్ రికార్డునే అధిగమించారు.దీన్ని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు “కౌశల్ ఆర్మీ” కౌశల్ కు ఎంత అండగా ఉన్నదో అని.

  •  
  •  
  •  
  •  

Comments