“కౌషల్ ఆర్మీ” దెబ్బకి రోల్ బాగా స్లో అయ్యాడుగా..!

Tuesday, January 1st, 2019, 01:05:59 PM IST

బుల్లితెర సంచలన షో “బిగ్ బాస్” రెండో సీజన్లో కౌశల్ కోసం తెలీని వారు ఎవరు ఉండరు.అస్సలు ఎవ్వరికి అందనంత మార్జిన్ తో కౌషల్ బిగ్ బాస్ 2 టైటిల్ ని కూడా గెలుచుకున్నారు.ఆ టైం లో కౌషల్ పేరు ఒక సంచలనమే అని చెప్పాలి.అప్పుడు ఆ షోలో ఉండే పోటీదారులకి బయట వారి యొక్క అభిమానులకు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది.మొదటి నుంచి కౌషల్ ను మిగతా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని కౌషల్ యొక్క అభిమానులు ఆరోపణ అది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉందని మళ్ళీ ప్రూవ్ అయ్యిందని వారు అంటున్నారు.

బిగ్ బాస్ లోనే ర్యాపిస్ట్ రోల్ రైడా కోసం కూడా అందరికి తెలుసు.అతను ఇటీవలే అన్ని ట్రోల్ మీద ఒక ర్యాప్ సాంగ్ ను కూడా విడుదల చేసారు.అంతే “కౌషల్ ఆర్మీ” దెబ్బకి లైక్స్ కన్నా డిస్ లైక్స్ ను ఎక్కువ మూటగట్టేసుకుంది ఆ వీడియో.ఎందుకంటే ఆ వీడియోలో ఒక లైన్ మాత్రం ఖచ్చితంగా కావాలనే కౌషల్ కోసమే రాసినట్టుందని చెప్పాలి.అప్పట్లో కౌషల్ కు డాక్టరేట్ వస్తుందని రకరకాల వార్తలొచ్చాయి.దానితో ఆ విషయాన్ని ఉద్దేశించి వక్రీకరంగా రోల్ ట్రోల్ చేద్దామనుకున్నాడు దానితో మరో సారి “కౌషల్ ఆర్మీ” చేతిలో దెబ్బ తిన్న మరో వ్యక్తిగా నిలిచిపోయాడు.వీళ్ళ డిస్ లైక్స్ దెబ్బకి కామెంట్స్ మరియు లైక్స్ ను కూడా బ్లాక్ చేసేసి,తాను కౌషల్ కు వ్యతిరేఖం కాదని,కేవలం ట్రోల్ల్స్ ఏవైతే వచ్చాయో వాటి కోసమే ఈ పాట రాసుకున్నా అని చెప్తూ ఒక వీడియో పెట్టి ముగించేశాడు.