“కౌశల్ ఆర్మీ” చర్యలు ఊహాతీతం అనాల్సిందే..”తిత్లి” తుఫాన్ బాధితులకు అండగా!

Wednesday, October 17th, 2018, 03:18:45 PM IST

బిగ్ బాస్ షో ముగిసిపోయినా సరే ఆ హౌస్ కి సంబందించిన ఒక్కరి పేరు మరియు అతని సైన్యం యొక్క పేర్లు మాత్రం ఇప్పటి వరకు అలా మారు మోగుతూనే ఉన్నాయి.వారే “కౌశల్” మరియు అతని బలం “కౌశల్ ఆర్మీ”. ఏ పోటీదారునికి సాధ్యం కానీ క్రేజ్ కౌశల్ సొంతం అయ్యింది.బిగ్ బాస్ షో ముగిసిపోయినా సరే టాక్ అఫ్ ది ట్రెండ్ లా ఎప్పుడు కౌశల్ పేరు విన్పిస్తూనే ఉంటుంది,దీనికి కారణం ఆయన అభిమానులే అని కూడా చెప్పొచ్చు.ఇప్పుడు తాజాగా కౌశల్ అభిమానులు తమ సేవా దృక్పధాన్ని చాటుకొని మరో మైలు రాయిని అందుకున్నారు.

గత కొన్ని రోజులు క్రితం శ్రీకాకుళం జిల్లా అంతటిని తిత్లి తుఫాను ఎంతలా కుదిపేసిందో అందరికి తెలుసు.ఈ విషాద ఘటనకు గాను ప్రతీ ఒక్కరు స్పందించి తమకి తోచిన సాయం అందిస్తున్నారు.ఇప్పటికే పలువు సినీ ప్రముఖులు కూడా తమ వంతు సహాయాన్ని విరాళ రూపంలో అందించారు.హీరో నిఖిల్ అయితే స్వయంగా బాధితుల దగ్గరకి వెళ్లి సాయాన్ని అందించారు.ఇప్పుడు తాజాగా కౌశల్ అభిమానులు కూడా తమ వంతు సాయం అందిస్తూ శ్రీకాకుళం తుఫాను బాధితులకు అండగా వారికి ఆహారాన్ని,తగిన మంచి నీరు ఇతర సరుకులు అందించి తమ గొప్పతనాన్ని చాటుకున్నారు.ఇప్పటివరకు కౌశల్ ఆర్మీ కోసం తప్పుగా మాట్లాడే ఇతర పోటీ దారుల అభిమానులు ఎత్తిన ప్రతీ వేలిని కిందకి దించేలా చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments