మోడీ నుంచి కాల్..నిజమేనా కౌశల్?

Wednesday, October 10th, 2018, 04:48:30 PM IST

బిగ్ బాస్ 2తెలుగు టైటిల్ విన్నర్ కౌశల్ తాను బయటికి వచ్చిన తర్వాత చాలానే ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.బిగ్ బాస్ హౌస్ లో తాను ఎదుర్కొన్న సంఘటనలను కౌశల్ చెప్పుకొచ్చారు.అంతే కాకుండా తన సహచర ఆటగాళ్ల కోసం వారి యొక్క స్వభావం కోసం కూడా కౌశల్ కొన్ని సంచలన విషయాలను బయట పెట్టారు.ఐతే ఇటీవలే కౌశల్ గెలిచాక తనకి భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి కాల్ వచ్చిందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.ఈ విషయం పై కౌశల్ తన సమాధానం ఇచ్చారు.

కౌశల్ గెలిచాక ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చిన సంగతి నిజమేనా అన్న ప్రశ్నకు గాను కౌశల్ తాను బిగ్ బాస్ 2 టైటిల్ గెలిచి బయటకి వచ్చిన మూడో రోజు మోడీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని,కానీ ఆ సమయానికి తాను షూటింగ్ లో ఉన్నానని అందువల్ల తమ ఇంట్లో వాళ్ళ నాన్న గారు వారితో మాట్లాడగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నామని బిగ్ బాస్ టైటిల్ గెలిచినందుకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు,కానీ ఆ కాల్ లో మాట్లాడింది చేసింది మాత్రం ఎవరు అన్నది కౌశల్ స్పష్టత ఇవ్వలేదు.