కౌశల్ ఆర్మీ ఓకే అంటే “జనసేన” పార్టీలోకి కౌశల్ ఎంట్రీ..!

Tuesday, October 9th, 2018, 05:01:06 PM IST

బిగ్ బాస్ 2 తెలుగు టైటిల్ విన్నర్ కౌశల్ ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మరియు ఆయన పార్టీ జనసేన పై కౌశల్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.బిగ్ బాస్ షోలో తనదైన శైలితో ఆడి ప్రేక్షకుల మన్ననలు పొందారు.కనీ వినీ ఎరుగని రీతిలో కౌశల్ కొన్ని కోట్ల ఓట్ల తేడాతో గెలుపొంది బిగ్ బాస్ 2 టైటిల్ సొంతం చేసుకున్నారు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరియు తన యొక్క రాజకీయ అరంగేట్రం ఉంటుందా లేదా అన్న విషయంపై తన స్పందన తెలియజేసారు.

ముందు నుంచి వారి కుటుంబం కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న కుటుంబం కాబట్టి ఇప్పుడు పర కళ్యాణ్ గారి జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తారా అని అడగగా,పవన్ కళ్యాణ్ గారంటే తనకి చాలా అభిమానమని,చాలా వరకు విషయాల్లో ఆయన నడవడిక నాలో తెలీకుండానే వచ్చేస్తుందని తెలిపారు.ఆయన అంత పెద్ద స్టార్ అయినా సరే చాలా సింపుల్ గా ఉంటారని అన్నారు.అదే సందర్భంలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందా అంటే ప్రస్తుతానికి,తన బలగం అయిన “కౌశల్ ఆర్మీ”ఏం చెప్తే అది చెయ్యడానికి తాను సిద్ధం అని తెలిపారు.అంటే కౌశల్ కు తన ఆర్మీ నుంచి ఒక్క సైగ వస్తే చాలు జనసేనానికి మరింత బలం చేకూర్చడానికి కౌశల్ సిద్ధం గా ఉన్నట్టే లెక్క.


  •  
  •  
  •  
  •  

Comments