బాబు గోగినేనికి భారతీయ పతాకం గురుంచి ఏమి తెలీదు..కౌశల్!

Tuesday, October 9th, 2018, 09:00:12 PM IST

బిగ్ బాస్ 2 తెలుగు టైటిల్ విన్నర్ తాను బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకి వచ్చాక తన రేంజ్ మారిపోయిందనే చెప్పాలి.తాను బయటకి వచ్చాక పలు ఇంటర్వ్యూలలో తనకి బిగ్ బాస్ ఇంట్లో జరిగిన అనుభవాలను ప్రేక్షకులకు చెప్పుకున్నారు.ఇప్పుడు కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సహచర ఆటగాడు,తనకి తానే అంతర్జాతీయ స్టార్ ని చేసుకున్న బాబు గోగినేని కోసం కౌశల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

తాను వెళ్లిన మొదటి నాలుగు,ఐదు వారాల వరకు బాబు గారు కౌశల్ బాగానే ఉన్నారని కాని కొన్ని రోజులు తర్వాత నన్ను తొక్కడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని కౌశల్ చెప్పుకొచ్చాడు.బిగ్ బాస్ ఇంట్లో మహిళలకు ఇచ్చినటువంటి ఒక టాస్క్ లో తనీష్ అడ్గుగుతున్న ఒక ప్రశ్నకు గాను బాబు గోగినేకి ఇంత అవగాహన ఉందా అని కౌశల్ ఆశ్చర్యపోయానని చెప్పారు.భారత్ జాతీయ పతాకంలో ఉన్నటువంటి అశోక చక్రంలో చువ్వలు తాను 24 ఉంటాయంటే బాబు గారు 26 అంటున్నారని,తనకి తాను ఇంటర్నేషనల్ ఫిగర్ అని చెప్పుకునే ఆయనకీ ఇలాంటి ప్రశ్నకు కూడా సరిగ్గా సమాధానం కూడా బాబు గారికి తెలీదా అని కౌశల్ అప్పుడు ఆశ్చర్యానికి లోనయ్యానని తెలిపారు.