స్టార్ హీరోల రేంజ్ లో కౌశల్ ఎంట్రీ..!

Thursday, October 4th, 2018, 06:22:15 PM IST

బిగ్ బాస్ 2 తెలుగు కార్యక్రమం చాలా సంచలనాలకు దారి తీసింది.అప్పటి వరకు ప్రేక్షకుల్లో కొద్దో గొప్పో పేరున్న నటీనటుల నిజ స్వరూపాన్ని అశేష తెలుగు ప్రేక్షకులకి తెలియజేసింది,దీనితో వారికున్న కాస్త ఆదరణ కూడా తగ్గిపోయింది.అదే సందర్భంలో వారి కన్నా తక్కువ ఆదరణతోనే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టి తన స్వభావంతో,నిజాయియితీతో అస్సలు ఎవ్వరూ ఊహించని స్థాయికి అత్యంత ప్రజాదరణతో బిగ్ బాస్ 2 టైటిల్ ను కౌశల్ సొంతం చేసుకున్నాడు.ఇది వరకు కౌశల్ కు ఉన్న ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉందని చెప్పుకునే వాళ్ళు కానీ ఈ రోజు జరిగిన ఒక సంఘటన చూస్తే జనంలో కౌశల్ కి ఉన్న ఫాలోయింగ్ వేరే రేంజ్ లో ఉందని చెప్పాల్సిందే.

బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన కౌశల్ కు అడుగడుగునా అతని అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.ఇంతకు ముందే కౌశల్ ఆర్మీ పేరిట 2000 వేల మంది అభిమానులు చేసిన వాక్ లు ఇవన్నీ ఒకెత్తు ఐతే ఈ రోజు కౌశల్ ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రేక్షకాదరణ ఒకెత్తు అని చెప్పాలి.ఈ రోజు హైదరాబాద్ లోని కౌశల్ ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రాగా అక్కడికి వేలాది సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.ఇంకా చెప్పాలి అంటే మన స్టార్ హీరోల స్థాయిలో వచ్చారనే చెప్పాలి.ఇలాంటివి ఐనా సరే చూసి కౌశల్ ని వ్యతిరేకించే వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని కౌశల్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.