సమీక్ష : కవచం

Friday, December 7th, 2018, 02:25:54 PM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా,కాజల్ అగర్వాల్ మరియు మెహ్రిన్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “కవచం” దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల శ్రీనివాస్ ను ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయ్యింది.ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షుకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే విజయ్(బెల్లం కొండ శ్రీనివాస్) ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు.అతను సంయుక్త(కాజల్)ని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనే సమయంలో ఆమె అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది.ఆ తర్వాత ఈ చిత్రంలో మరో హీరోయిన్ మెహ్రీన్ ని కూడా కిడ్నాప్ అవుతున్న సమయంలో విజయ్ వచ్చి ఆమెను కాపాడుతాడు.కానీ అతని యొక్క నీతి,నిజాయితీలు అన్ని అనుకోకుండా విజయ్ తప్పులు చేసినట్టుగా కనిపిస్తాయి.అసలు అతను చేసిన తప్పులు ఏమిటి?వాటి వెనుక ఉండి నడిపిస్తుంది ఎవరు?సంయుక్త అంత సడన్ గా మాయమయ్యాడు గల కారకులు ఎవరు అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే.

విశ్లేషణ :

ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ అద్భుత నటనను కనబర్చారు.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ యొక్క పాత్ర కీలకమైనది గా చెప్పొచ్చు.కథని అంతటిని మలుపు తిప్పేలా తన పాత్ర ఈ చిత్రంలో ఉంటుంది.అంతే కాకుండా మెహ్రీన్ పాత్ర కూడా ఈ చిత్రంలో కీ రోల్ పోషించింది అనే చెప్పాలి.అంతే కాకుండా చివరి అరగంటలో వచ్చే సన్నివేశాల్లో నీల్ నితిన్ నటన మెచ్చుకొని తీరాల్సిందే.ఇక మిగిలిన నటీనటులు వారి పరిధి మేరకు పోసాని,సత్యం రాజేష్ మరియు ముకేశ్ రిషీలు పర్వాలేదనిపించారు.ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు.ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో మరియు పాటలు చిత్రీకరణలో చోటా యొక్క పనితనం బాగుంది.

కేవలం కొన్ని సన్నివేశాల మీదనే పెట్టిన శ్రద్ధ దర్శకుడు మిగతా సన్నివేశాల మీద పెట్టడంలో విఫలమయ్యారు.అరకొరగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు,ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఫస్టాఫ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమి లేదు.సినిమా మొదలయిన ఒక గంట వరకు ప్రేక్షకులకు ఒక క్లారిటీ అంటూ రాదు.ఇంటర్వెల్ తో హైప్ తెచ్చిన దర్శకుడు అదే హైప్ ని నిలబెడుతూ చిత్రాన్ని సెకండాఫ్ లో కొనసాగించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. సెకండాఫ్ కూడా కాస్త సాగదీతగా ఉన్నట్టుంటుంది.హీరో విలన్ల మధ్య వచ్చే మైండ్ గేమ్ సన్నివేశాలను ముందు ఎంత ఆసక్తికరంగా తీసుకెళ్లారో అదే స్థాయిని కొనసాగించడంలో దర్శకుడు తర్వాత విఫలం అయ్యారు.

ప్లస్ పాయింట్స్ :

ఇంటెర్వెల్ బ్యాంగ్.
శ్రీనివాస్ నటన.
కథానుసారం కొన్ని కీలక ట్విస్టులు.
బాక్గ్రౌండ్ మ్యూజిక్
కాజల్ కీ రోల్.

మైనస్ పాయింట్స్ :

అనవసరమైన కొన్ని ట్విస్టులు.
సాగదీతగా సాగే సెకండాఫ్.
కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు.

తీర్పు :

ఇప్పటివరకు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాల్లో అన్నిటిని చూసుకున్నా అతని సినిమాల్లో ప్రొడక్షన్ విలువలు ఎప్పుడు అద్భుతంగానే ఉంటాయని చెప్పాలి.అదే విధంగా కూడా ఈ సినిమా నిర్మాణ విలువల్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.శ్రీనివాస్ యొక్క బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు గా ఉండే పోరాట సన్నివేశాలు,ముఖ్యంగా చోటా యొక్క కెమెరా పనితనం ఎలా ఉంటుందో ఈ సినిమా తో మరో సారి నిరూపించారు.దర్శకుడు తాను అనుకున్నది అనుకున్నట్టుగా తెరక్కేక్కిస్తే బాగున్ను.మొత్తానికి ఈ చిత్రం యావరేజ్ గా నిలవొచ్చు.

Rating : 2.5/5

REVIEW OVERVIEW
Kavacham Telugu Movie Review