కవచం మూవీ ట్విట్టర్ టాక్.. బెల్లంకొండ శ్రీనివాస్, కాజ‌ల్‌లు మాత్ర‌మే..?

Friday, December 7th, 2018, 08:30:04 AM IST

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వార‌సుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన హిట్ కొట్ట‌లేదు. వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్‌తో ముందుకు వ‌స్తున్నా ఇప్ప‌టి వ‌క‌కు ప్రేక్షకుల మ‌దిలో నిలచిపోయే చిత్రం రాలేదు. దీంతో స‌రైన హిట్ కోసం ప‌ట్టుద‌ల‌తో ఉన్న శ్రీనివాస్ తాజాగా క‌వ‌చం చిత్రంతో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

క‌వ‌చం థ్రిల్ల‌ర్‌ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కి ఈ చిత్రంలో శ్రీనివాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఈ చిత్రంలో మెహ్రీన్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. శ్రీనివాస్ మామిళ్ళ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ శొంఠినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన క‌వ‌చం మూవీ టీజ‌ర్, ట్రైల‌ర్‌లు ప్రామిసింగ్‌గా ఉండ‌డంతో ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి.

ఈ చిత్రంలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో దర్శనం ఇచ్చిన శ్రీనివాస్, డైలాగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడ‌ని తెలుస్తోంది. కాజల్‌,మెహ్రీన్‌ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వరుస మ్యూజికల్ హిట్స్‌తో దూసుకుపోతున్న తమన్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్‌తో పాటు, అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. బాలీవుడ్ నటుడు నిల్ ముకేశ్ రిషి ప్రతి నాయకుడి పాత్రలో నటించ‌గా.. స్క్రీన్ ప్లే సూప‌ర్‌గా ఉంద‌ని, డైలాగ్స్ ఈ చిత్రానికి హైలెట్ అని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ ప‌రీమియ‌ర్లు ప‌డ‌క‌పోవ‌డంతో, ఈ సినిమా టాక్ బ‌య‌ట‌కు రాలేదు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్‌తో పాటు మ‌రికొంత‌మంది ఈ మూవీ పై ట్విట్ట‌ర్‌లో స్పందించారు.