టీడీపీ – వైసిపి కి మద్దతు ఇచ్చిన కవిత

Friday, February 9th, 2018, 12:15:11 AM IST

ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఆందోళన రోజు రోజుకి తార స్థాయికి చేరుతోంది. వైసిపి టీడీపీ నేతలు పార్లమెంటులో చేస్తున్న ఆందోలనకు ఇతర పార్టీ నేతలు మద్దతు పలుకుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కవిత కూడా ఈ విషయంపై లోక్ సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు చట్టంలో ఎలాంటి హామీలను ఇస్తామని చెప్పారో అలాంటి హామీలను ఏపీ తెలంగాణలకు వెంటనే అమలు చేయాలన్నారు. టీడీపీ – వైసిపి నేతలు చేస్తోన్న పోరాటంలో న్యాయం ఉందని ఎన్డీయే మిత్ర పక్షం ఆందోళన చేయడం వల్ల మంచి పరిణామం కాదని తెలిపారు. రైతులు ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. వారి పంటలకు కనీసధరను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం 26 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధరను ఇస్తున్నారని తెలుపుతూ.. రైతులకు ఉపయోగపడే కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments