హ‌రీష్ ఆర‌డుగుల బుల్లెట్టు అట‌.. అబ్బ‌బ్బ‌!!

Saturday, September 24th, 2016, 10:18:09 PM IST

kavitha
ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌డంలో మంత్రి హ‌రీష్‌రావుది ఓ ప్ర‌త్యేక శైలి. శ‌త్ర‌వుపై భూకంపంలా విరుచుకుప‌డుతుంటాడు. మొన్న‌టికి మొన్న కేసీఆర్ ముందే అత‌డి ఓవ‌రాక్ష‌న్ ఏంటో చూశారు జ‌నం. అయితే అత‌గాడి గురించి ఎంపీ క‌విత ఓ రేంజులో వ‌ర్ణించేశారు.

మంత్రి హరీష్‌రావును ఆరు అడుగుల బుల్లెట్‌.. అంటూ పొగిడేశారు. కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంత‌రం మాటా మంతీలో హ‌రీష్ పేరు ప్ర‌స్థావ‌న‌కు రాగానే ఈ మాట అనేశారు లేడీ ఎంపీ. జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ క‌విత పాల్గొని మార్కెట్ క‌మిటీల గురించి మాట్లాడారు. మార్కెట్‌ కమిటీల్లో వెన‌క‌బ‌డిన‌, బ‌డుగు బ‌ల‌హీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు క‌విత‌.