ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలి.. కేసీఆర్ ఆర్డర్?

Tuesday, May 1st, 2018, 08:42:53 AM IST

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ నాయకుల్లో ఎంత ఆందోళన ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కనిపించకుండా లోలోపల ఆలోచనలతో ప్రణాళికలతో సిద్ధమవుతుంటారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న నాయకులు ఒక్కసారిగా అలెర్ట్ అయిపోతారు. ఇప్పుడు తెలంగాణాలో ఉన్న అన్ని పార్టీలు కూడా రహస్య మీటింగ్ లతో చాలా చర్చలు సాగిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది చివరిలోగానే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగేలా ఉన్నాయని గత కొంత కాలంగా కేంద్ర నుంచి సమాచారం అందుతోంది. అంతే కాకుండా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగవచ్చని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఈ విషయం పై మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరికి వారు పార్టీ సభ్యులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రీసెంట్ గా నాయకులతో చర్చలు జరిపి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రతి ఒక్కరు నియోజక వర్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అంతే కాకుండా నాయకుల్లో కొత్త బలాన్ని కూడా కేసీఆర్ నింపారు. సర్వేల ప్రకారం దాదాపు అన్ని స్థానాల్లో టీఆరెస్ చాలా బలంగా ఉందని తెలుపుతూ.. తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మనమే గెలవగలమని భరోసా ఇచ్చారు. పైగా థర్డ్ ఫ్రంట్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. అది వర్కౌట్ అయితే టీఆరెస్ కి జాతియా స్థాయిలో ఎక్కువ పాపులారిటీ వస్తుంది. ఇక కొన్ని జిల్లాల్లో ఇంకా పార్టీ బలపడాలని తెలియజేస్తూ..అందుకు తగ్గ నాయకులను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉందని కేసీఆర్ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలనే విధంగా నేతలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments