“ఓటుకు నోటు” కేసుపై మరోసారి బాబుని ఏకి పారేసిన కెసిఆర్.!

Friday, October 5th, 2018, 07:42:51 PM IST

ఈ రోజు వనపర్తి లోని కెసిఆర్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ ఒక్కరిని వదిలి పెట్టడం లేదు.ఇంతకు మునుపు జరిగినటువంటి సభల్లో కూడా అటు కాంగ్రెస్ నాయకులను మరియు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు మీద కూడాను తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ రోజు మాత్రం విమర్శల స్థాయి ఇంకాస్త ఎక్కువే పెంచారు అని చెప్పుకోవాలి తెలంగాణాకి ద్రోహం చేశారు అంటూ జవహర్ లాల్ నెహ్రు నుంచి సోనియా వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు,అదే సందర్భంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ చంద్రబాబు మీద మాట్లాడుతూ,తెలంగాణా ఎన్నికలలో పొత్తుల నిమిత్తం కాంగ్రెస్ వారు చంద్రబాబుని తీసుకువస్తున్నారని,చంద్రబాబు మాటలకు సమాధానం ఇస్తూ నరేంద్ర మోడీతో కలిసిపోయే అవసరం నాకేముందని ప్రశ్నించారు.నేను తనని వేదిస్తున్నాని అంటున్నారని,నువ్వు చక్కటి మనిషివని వేదిస్తున్నానా నేను అని మండిపడ్డారు.ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయింది నువ్వు కాదా?,నువ్వు పంపిన రేవంత్ రెడ్డి కూడా దొరికిపోలేదా?అది అబద్దమా,నిజం కాదా ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా అని ప్రశ్నలు సంధించారు.సాక్ష్యాలుగా దొరికినటువంటి ఆడియో రికార్డులలో ఉన్న గొంతు నీది కాదా అని మళ్ళీ ఓటుకు నోటు కేసును గుర్తు చేశారు.