నేడు తాడో పేడో తేలిపోతుంది

Wednesday, September 21st, 2016, 10:09:19 AM IST

KCR-BABU
నీటి ప్రాజెక్టుల విష‌యంలో మ‌రి కొన్ని గంట‌ల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు-తెలంగాణ సీఏం కేసీఆర్ ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ తో భేటి కానున్నారు. ఇరు రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రులు త‌మ చివ‌రి వాద‌న‌ల‌ను వినిపించ‌నున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు రెండు రాష్ట్రాల‌ నిటీ పారుద‌ల శాఖ మంత్రులు, ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శులు స‌మావేశం అయిన‌ప్ప‌టికీ పొత్తు కుద‌ర‌లేదు. దీంతో అమితుమీ తేల్చుకోవాడ‌నికి సిద్ద‌మ‌య్యారు.

పాల‌మూరు, డిండి అక్ర‌మ ప్రాజెక్టుల‌ని, కేంద్రం అనుమ‌తి తీసుకోకుండానే కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ టీ ప్ర‌భుత్వం రీ డిజైన్ చేసింద‌ని కేంద్రానికి వినిపించాల‌ని బాబు రెడీ అయ్యారు. ఇటు తెలంగాణ ప‌ట్టిసీమ ద్వారా గోదావ‌రి నీటిని కృష్ణాకు త‌ర‌లించ‌డం వ‌ల్ల అపార న‌ష్టం ఏర్ప‌డుతుంద‌ని – అంతే నీటిని తెలంగాణ‌కు కేటాయించాల‌ని కేసీఆర్ అపెక్స్ ముందు వినిపించ‌నున్నారు. ఈ విష‌యాన్ని తెల్చడం కేంద్రానికి కూడా త‌ల‌కు మించిన భార‌మే. ఇప్ప‌టికే ఈ స‌మ‌స్య‌పై ఇరు రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌ఖ్య‌త స‌రిగ్గా లేదు. ప‌లు మార్లు స‌మావేశమైన స‌త్ఫ‌లితాలు క‌నిపించ‌లేదు. ఈసారి అపెక్స్ ముందు జ‌రిగే భేటితో తాడో పేడో తెలిపోవ‌డం ఖాయ‌మ‌ని ప్రజ‌లు భావిస్తున్నారు. ఈ భేటి ఉద్విగ్నంగా మారితే త‌మిళనాడు- క‌ర్ణాట‌క రాష్ట్రాల త‌ర‌హాలో ఆగ్ర‌హ జ్వాల‌లు త‌లెత్త‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని వామ‌ప‌క్షాలు భావిస్తున్నాయి.