గులాబీ పువ్వు పంచారు.. నీళ్లు పంచలేక పోయారు..!

Thursday, September 22nd, 2016, 03:47:22 AM IST

chandrababu-and-kcr
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరైన సంగతి తెలిసిందే.కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమా భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు చంద్రులు హాజరయ్యారు.మొదట సమావేశానికి చంద్రబాబు చేరుకోగా అనంతరం కేసీఆర్ చేరుకున్నారు. ఉమాభారతికి కేసీఆర్ పుష్పగుచ్చాన్ని అందజేశారు. అందులో ఉన్న గులాబీ పూలని రెండింటిని తీసి ఆమె ఇద్దరు ముఖ్యమంత్రులకు అందజేసింది. దీనితో అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగి తేలారు.

కానీ సమావేశంలో పువ్వులను పంచినంత తేలికగా ఇరురాష్ట్రాలకు నీటి పంపకాలు చేయలేకపోయారు. సమావేశం అనంతరం మాట్లాడిన ఆమె ఇరురాష్ట్రాలను దామాషా పద్దత్తిలో నీటిని పంచుతానమని అన్నారు. చర్చ ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందని అన్నారు. దిండి, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులపై ఇరురాష్ట్రాలకు ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని అన్నారు. నీటి పంపిణీ పై కేంద్రం.. కృష్ణ ట్రిబ్యునల్ నుంచి నివేదిక తెప్పించుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.