మ‌రో ఇద్ద‌రు గులాబీ అభ్య‌ర్థులు వీళ్లే..

Monday, October 22nd, 2018, 12:30:07 PM IST

తెలంగాణ అసెంబ్లీని 9 నెల‌ల ప‌ద‌వీకాలం వుండ‌గానే ర‌ద్దు చేసిన కేసీఆర్ ఆ వెంట‌నే 119 సీట్ల‌కు గానూ 105 మంది సిట్టింగ్‌ల‌ను ప్ర‌క‌టించి విస్మ‌యానికి గురిచేశాడు. సెప్టెంబ‌ర్ 6నే త‌మ సిట్టింగ్‌ల‌ను ప్ర‌క‌టించిన ఆయ‌న తాజాగా మ‌రో ఇద్ద‌రు అభ్య‌ర్థుల్ని ఆదివారం నిర్వ‌హించిన నియోజ‌క వ‌ర్గ అభ్య‌ర్థుల స‌మ‌న్వ‌య స‌మావేశంలో ప్ర‌క‌టించేశారు. అవి అత్యంత కీల‌క‌మైన‌ జ‌హీరాబాద్‌, మ‌ల‌క్‌పేట్ అసెంబ్లీ స్థానాలు. జ‌హీరాబాద్ నుంచి కె. మాణిక్‌రావు, మ‌ల‌క్‌పేట నుంచి చాలా స‌తీష్‌కుమార్ టీఆర్ఎస్ త‌రుపున పోటీప‌డ‌నున్నారు.

ఇందులో కీల‌కంగా వున్న‌ది జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డి నుంచి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు గీతారెడ్డి గ‌త కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. పైగా ఇది ఎస్సీ రిజ‌ర్వేష‌న్ స్థానం. 2009 నుంచి 2014 ఎన్నిక‌ల్లోనూ ఈ స్థానాన్ని ఎస్సీ రిజ‌ర్వేష‌న్ గానే కేటాయించారు. ఇక్క‌డి నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ మ‌హిళా నేత గీతారెడ్డి 57,558 ఓట్లు సాధించి గెలుపొందింది. అయితే తెరాస నుంచి బ‌రిలోకి దిగిన అభ్య‌ర్థి 56, 716 ఓట్లు సాధించి స్వ‌ల్ప తేడాతో ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇక ఇదే నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీకి దిగిన టీడీపీ అభ్య‌ర్థి ఎం. న‌రోత్తంకు 39,057 ఓట్లు పోల‌య్యాయి. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్ క‌లిసి పోటీకి దిగుతోంది కాబ‌ట్టి ఈ సారి కూడా గెలుపు అవ‌కాశాలు కాంగ్రెస్‌కే ఎక్కువ‌గా వుండే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అయితే ఈ స్థానాన్ని గీతారెడ్డికే కేటాయిస్తామ‌ని మ‌హాకూట‌మి వ‌ర్గాలు ఇంకా వెల్ల‌డించ‌క‌పోవ‌డం తెరాస వ‌ర్గాల‌కు ఊర‌ట క‌లిగిస్తోంది. ఇది ఇలా వుంటే మ‌ల‌క్‌పేటలో పోటీ కూడా ర‌స‌వ‌త్త‌రంగా వుండేలా వుంది. గ‌తంలో ఇక్క‌డి నుంచి తెరాస అభ్య‌ర్థిగా చావా సంతోష్‌కుమార్ పోటీకి దిగి ఎంఐఎం అభ్య‌ర్థి బ‌లాల్ చేతిలో ఓట‌మి చ‌విచూశారు. అత‌నికి 58, 391 ఓట్లు పోల‌య్యాయి. ప్ర‌స్తుతం ఎంఐఎం తెరాస‌తో దోస్తీక‌డుతోంది కాబ‌ట్టి ఈ సీటు తెరాస‌కే కేటాయిస్తుందా? అన‌క మ‌ళ్లీ త‌మ అభ్య‌ర్థినే పోటీకి దింపుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments