మేడారంలో మొక్కులు చెల్లించిన కేసీఆర్!

Saturday, February 3rd, 2018, 03:52:53 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దైవ భక్తి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ఉత్సవం అయినా ఏ పండగ అయినా ఎదో ఒక దేవాలయాన్ని ఆయన సందర్శిస్తునే ఉంటారు. ఇక ప్రస్తుతం మేడారం జాతర ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో భక్తులు ఆ జాతరకు వచ్చారు. అయితే కేసీఆర్ కూడా ఆ జాతరకు సతీసమేతంగా వెళ్లారు. అలాగే ఆయన కూతురు కవిత తో పాటు మనవడు హిమాన్షు జాతరలో పాల్గొని సమ్మక్క-సారలమ్మలను సందర్శించుకున్నారు. అనంతరం కేసీఆర్ దంపతులు వనదేవతలకు పట్టువస్త్రాలను సమర్పించారు. అలాగే గద్దెల వద్దకు బంగారాన్ని (బెల్లం) మోసుకెళ్లి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అలాగే స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు కూడా సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు.