అనుకోని అతిధిగా పెళ్లికి వెళ్లిన కేసీఆర్

Thursday, May 10th, 2018, 06:27:16 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడి కన్నా ఒక సాధారణ వ్యక్తిగా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పవచ్చు. ఎక్కడ పర్యటన చేసిన కేసీఆర్ తన మార్క్ ఉండేలా చూసుకోవడం అలవాటు. ఇక ఈ రోజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అటు నుంచి సీఎం కేసీఆర్ తన బృందంతో శంకరపట్నం మండలం సమీపంలో ఉన్న తడికల్ గ్రామం గుండా ప్రయాణిస్తుండగా సడన్ గా కారు నుంచి దిగి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఓ ఇంట్లో పెళ్లి జరుగుతుందని తెలుసుకొని వెంటనే తన కాన్వాయ్ ని ఆపేసి పెళ్లి వేదిక వద్దకు వెళ్లారు. దీంతో పెళ్లి వేడుకకు వచ్చిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనుకోని అతిధిగా వచ్చిన కేసీఆర్ ను ఆహ్వానించారు. ఇక కేసీఆర్ నూతన వధూవరులను ఆశీర్వదించి కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. కేసీఆర్ తో పాటు మంత్రి ఈటెల రాజేందర్ ఇతర ముఖ్య నేతలు కూడా ఆ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.