కెసిఆర్ అపరిచితుడులో విక్రమ్ లా రూపాలు మారుస్తున్నాడు..!

Sunday, October 7th, 2018, 02:00:31 AM IST

నిన్న వనపర్తిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసినదే.ఇప్పుడు అదే మాటలపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబానికి సంబందించిన కొన్ని ఛానళ్ళు వారు తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారని,తన మీద అసత్య ప్రచారాలు ఆపాలని గట్టి వార్నింగ్ ఇచ్చారు,అంతే కాకుండా కెసిఆర్ కాంగ్రెస్ ను చూసి భయపడిపోతున్నారని,కెసిఆర్ అపరిచితుడులోని విక్రమ్ లా రకరకాల విన్యాసాలు చేస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నానన్న కనీస జ్ఞ్యానం కూడా లేకుండా అసభ్య పదజాలంతో సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు నోటికొచ్చినట్టు దుర్భాషలు మాట్లాడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి నీచమైన భాషా,నీచమైన సంస్కృతి కెసిఆర్ కే చెల్లుతుందని విమర్శించారు.ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు పక్క రాష్ట్రాల్లో తమ ముఖ్యమంత్రి కెసిఆర్ అని చెప్పుకోవడానికి తెలంగాణా ప్రజలు సిగ్గు పడతారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.