తెలంగాణ రాజకీయ పార్టీలకు కేసీఆర్ బంపర్ ఆఫర్!

Friday, August 10th, 2018, 11:46:22 AM IST

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీల నేతలు ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. వారి స్టైల్లో ప్రణాళికలను రచిస్తూ అధికార పార్టీలకు చెక్ పెట్టాలని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి తెరాస అధినేత కేసీఆర్ ఆలోచన విధానం మాత్రం డిఫెరెంట్ కాగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఎగిరిగంతేసాల ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా చంద్రబాబు ఓ కొత్త పాలిసీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సంఖ్యాబలం పరంగా అన్ని పార్టీలకు భూములను లీజుకు ఇచ్చేలా టీడీపీ సర్కారు నిర్ణయించగా.. కేసీఆర్ మాత్రం 100 రూపాయలకే గజం భూమిని రాజకీయ పార్టీలకు జిల్లా కేంద్రాల కోసం ఇస్తున్నారట. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీ ఆఫీసు నిర్మించుకోవడానికి వీలుగా భూములను కేటాయించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల జరిపిన మంత్రివర్గ సమావేశంలో చర్చలు జరిపిన కేసీఆర్ అంతా సిద్దమైన తరువాత అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments