`ముంద‌స్తు`లో కుల రాజ‌కీయం?

Wednesday, October 24th, 2018, 03:38:35 PM IST

తెలంగాణ‌లో ముంద‌స్తు ముస‌లం మామూలుగా లేద‌న‌డానికి ఇదిగో ఈ న్యూస్ పేప‌ర్ క‌టింగే ఓ సాక్ష్యం. తెలంగాణ అధికార పార్టీ తేరాసకు కొమ్ము కాసే ప‌త్రిక‌గా న‌మ‌స్తే తెలంగాణ‌కు ఉన్న పాపులారిటీ గురించి విడిగా చెప్పాల్సిన ప‌నేలేదు. త‌న‌కు ఓ మీడియా అండ‌దండ‌లు అవ‌సరం అని భావించిన కేసీఆర్ న‌మ‌స్తే తెలంగాణ పత్రిక‌ను వాటాదారుల నుంచి బ‌ల‌వంతంగా హ‌స్త‌గ‌తం చేసుకున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ కాలంలో ప్రారంభ‌మై, ఉద్య‌మానికి బాస‌ట‌గా నిలిచిన ఈ ప‌త్రిక‌ను ప్రారంభించింది బిజినెస్ మ్యాగ్నెట్ సి.ఎల్‌.రాజం. ఆయ‌న వాటా అందులో 70శాతం మించి. కేవ‌లం 18 శాతం వాటాను మాత్ర‌మే క‌లిగి ఉన్న కేసీఆర్ ఉద్య‌మానంత‌రం బ‌ల‌వంతంగా అత‌డి నుంచి లాక్కున్నార‌ని చెబుతారు.

ఆ క్ర‌మంలోనే సి.ఎల్‌.రాజం అధికార తేరాస‌పైనా, కేసీఆర్ పైనా ప్ర‌తీకారం తీర్చుకునేందుకు, వ్య‌తిరేక గ‌ళం విప్పేందుకు విజ‌య‌క్రాంతి డెయిలీ పేరుతో ఓ ప‌త్రిక‌ను ప్రారంభించారు. ఈ ప‌త్రిక‌లో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌డుతూ నిరంత‌రం ఘాటైన వార్త‌ల్ని ప్ర‌చురిస్తున్నారు. ఇదిగో న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో కుల రాజ‌కీయాల గురించి, కులం కంగాళీ గురించి వ‌చ్చిన వార్త‌ల్ని క్యాచ్ చేయ‌డం విశేషం. ఆర్య వైశ్య సంఘానికి ఆయ‌న ఫోటోనే, రెడ్డి కులానికి ఆయ‌న ఫోటోనే ప్ర‌చురించి స‌ద‌రు ప‌త్రిక‌లో ప్ర‌చురించేశారు. ఈ ఫోటో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. ఇక కుల నాయ‌కుల్ని మ‌చ్చిక చేసుకునేందుకు, ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు తెర‌తీస్తున్న వైనం ఇందులో బ‌య‌ట‌ప‌డుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments