105లో ఎలాంటి మార్పు ఉండదు !

Sunday, September 23rd, 2018, 07:18:42 PM IST

ముందుస్తు ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీ రద్దు రోజే 90శాతం నియోజక వర్గాల్లో పోటీచేసే అభ్యర్థలను ప్రకటించి షాక్ ఇచ్చిన టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆ జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఇక ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక మరో వైపు టికెట్ దక్కని ఆశావహులు తమ ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తున్నారు. దాదాపు రెండు సీట్లలో తప్ప సిట్టింగులకే మళ్ళీ టికెట్ ఇచ్చిన కేసీఆర్ మరో 5సీట్లను పెండింగ్ లో పెట్టారు. చివర్లో తన అభిప్రాయాన్ని మార్చుకొని ఛాన్స్ ఇస్తాడేమోనని ఆశావాహులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇక టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది. సర్వేల్లో వెనుకబడిన మళ్ళీ ఆ అభ్యర్థులకే టికెట్ కేటాయించడంతో పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు దూకుడుతో వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఈ సారి 100ఫై చిలుకు నియోజక వర్గాల్లో గెలుపు బావుటా ఎగురవేస్తామని ధీమాగా వుంది.