ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ.. ఒంటరిగానే పోటీ : కేసీఆర్

Friday, September 7th, 2018, 02:50:21 AM IST

కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం ప్రకటించిన అభ్యర్థుల గురించి ప్రస్తుతం మీడియాల్లో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ సడన్ ట్విస్ట్ ఇచ్చారు. ఇకపోతే ప్రతిపక్షాలు ప్రస్తుతం విమర్శలు చేసే పనిపెట్టుకుంది. కేసీఆర్ తో భారత జనతా పార్టీ ఒకటేనని గత కొంత కాలంగా కాంగ్రెస్ నాయకులూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై కేసీఆర్ మరోసారి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.

భారత జనతా పార్టీ తమకు ఏ మాత్రం మిత్ర పక్షం కాదని రీసెంట్ గా నిర్వహించిన మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. అదే విధంగా రాబోయే ఎలక్షన్ లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు తెలిపారు. ఇక ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడుతూ..ఎంఐఎం మాకు ఫ్రెండ్లీ పార్టీ. ఆ పార్టీతో కలసి పని పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీ రద్దుకు వెళ్లినట్లు కేసీఆర్ తెలియజేశారు. అదే విధంగా ఎలక్షన్ లో క్రమశిక్షణతో నిబద్దతో ముందుకు వెళ్లే విధంగా కార్యాచరణ ఉంటుందని ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో 21.96 శాతం వరకు రాష్ట్ర ప్రగతిని సాధించిందని కేసీఆర్ మాట్లాడారు.

  •  
  •  
  •  
  •  

Comments