కోదండరామ్ ఎవరు?.. కేసీఆర్ కౌంటర్

Saturday, September 30th, 2017, 02:50:15 AM IST


తెలంగాణాలో రాజకీయ నాయకుల మధ్య వివాదాలు చెలరేగితే మాములుగా ఉండదు ఒకరోజు మొత్తం బ్రేకింగ్ న్యూస్ లు పడాల్సిందే. చాలా రోజుల తర్వాత అధికార పార్టీ మరియు వామ పక్షాల మధ్య తీవ్ర స్థాయిలో అలజడులు రేగుతున్నాయి. ఇక సమస్యలు ఉన్నాయంటూ ఒంటరి పోరాటం చేస్తున్న జేఏసీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ కేసీఆర్ ఎప్పుడు జేఏసీపై కామెంట్స్ చేయలేదు. అయితే ఇటీవల జేఏసీ అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సింగరేణి ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై కేసీఆర్ స్పందించారు. కేవలం ఓట్ల కోసం అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెబుతూ.. కోదండరాం ఎవరో తనకు తెలియదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా తాడు బొంగరం లేని వాళ్లు ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటిని మేము పట్టించుకోము. మేము ఏది చెయ్యాలో అది చేస్తామని సీఎం బదులిచ్చారు. సింగరేణి ఉద్యోగాల విషయంలో కూడా గత పాలకుల కన్నా తాము అందరికి మంచే చేశామని వివరించారు.నల్లగొండ ఉప ఎన్నిక గురించి ప్రస్తావించిన కేసీఆర్ అక్కడ ఎన్నిక వస్తుందనేది ఇంకా ఫైనల్ కాలేదని. ఒకవేళ వస్తే తప్పకుండా టీఆరెస్ పార్టీ గెలుస్తుందని కేసీఆర్ చెప్పారు

  •  
  •  
  •  
  •  

Comments