కేసీఆర్ చెప్పినట్టు మోదీ చేసుంటే అంతా నెత్తిన గుడ్డేసుకునేవాళ్ళు !

Tuesday, November 15th, 2016, 02:17:18 AM IST

modi-kcr
ప్రధాని మోదీ పెద్ద నోట్లరద్దు ప్రకటించిన దగ్గర్నుంచి చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి రాజకీయ నాయకుడు ఆయన్ను విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ జాబితాలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేరిపోయారు. మోదీ చేసిన పని పనికిమాలినదని అంటూ ఈ అంశంలో కేంద్రాన్ని ఒత్తిడికి కూడా గురిచేస్తామని హెచ్చరిస్తున్నారు. నోట్ల రద్దు వలన కొత్త రాష్ట్రం తెలంగాణా అన్ని విధాలా నష్టపోతొందని చెబుతూ ఆ నష్టాన్ని ఎల్కగట్టే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అలాగే మోదీ ఈ పద్దతిని ఎలా అమలు చేసి ఉండాల్సింది కూడా సెలవిచ్చారు.

మోదీ ఈ ప్లాన్ అమలు చేయాలి అని అనుకున్నప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ఒక మీటింగ్ పెట్టి వారికి తన ప్లాన్ వివరాలు తెలియజేసి అప్పుడు అమలు చేయాల్సిందట. ఒకవేళ నిజంగా కేసీఆర్ చెప్పినట్టు మోదీ ముందుగా ముఖ్యమంత్రులకు సమాచారమిచ్చి ఈ పని చేసుంటే నల్ల దొంగలు నల్ల డబ్బుని ఎప్పుడో సేఫ్ చేసేసుకుని ఉండేవాళ్ళు. ఇండియాలో అసలు మనీయే లేదన్న అవాస్తవ సత్యం ప్రకటింపబడేది. అప్పుడు ప్లాన్ అమలు చేసిన మోదీ, ఆయన నిర్ణయాన్ని గౌరవించి దేశానికి ఏదో మంచి జరుగుతుందని నమ్మి ప్రస్తుతం నానా అవస్థలు పడుతున్న ప్రజలు అందరూ నెత్తిన గుడ్డేసుకునేవాళ్ళు. ఆ విషయం తెలుసు కాబట్టే మోదీ సీక్రెట్ గా ప్లాన్ చేసి ఈ విధానాన్ని అమలు జరిపారు.