అధినాయ‌కుడి మొండెమే మిగిలింది!

Sunday, September 2nd, 2018, 12:32:55 AM IST

కొన్నిటికి ప్ర‌కృతి నుంచి విఘ్నాలు త‌ప్ప‌నిస‌రి. ముహూర్తం స‌రిగా కుద‌ర‌కపోతే ఊహించ‌ని విప‌త్తులు ఎదుర‌వుతుంటాయి. ప్ర‌స్తుతం ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ఏదో ఊహించ‌ని అడ్డంకి త‌ప్ప‌నిస‌రి అని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఓవైపు ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో జ‌న‌సందోహం కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతుంటే మ‌రోవైపు భారీ వర్షం, ఈదురు గాలుల దెబ్బ‌కు క‌టౌట్లు అన్నీ ఎగిరి కింద ప‌డ్డాయ‌ని వార్త అందింది.

స‌భా వేదిక‌కు అత్యంత స‌మీపంలో .. తేరాస అధినాయ‌కుడు కేసీఆర్ భారీ కటౌట్ కుప్ప కూలిపోయింది. ఆట పాటలలో మునిగిన కళాకారులు ఆదివాసులు, వివిధ వేషధారణలతో ఉన్నా కళాకారులంతా వర్షం తాకిడి తట్టుకోలేక ఒక్క‌సారిగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక కేసీఆర్ భారీ కటౌట్ నుంచి త‌ల తెగి ప‌డ‌డంతో అధినాయ‌కుడి త‌ల ఎవ‌రు తీశారు? అంటూ ఒక‌టే ముచ్చ‌ట సాగుతోంది. అంతా ఆ ప్ర‌కృతి మ‌హిమ‌.

  •  
  •  
  •  
  •  

Comments