కేసీఆర్ మైండ్‌లో ప్లాన్‌-ఏ, ప్లాన్ -బి!

Monday, September 10th, 2018, 12:40:49 AM IST

రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలో ఏ పావును ఎటు క‌ద‌పాలో .. ఏ పాచికను ఎలా విస‌రాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కి తెలిసినంత‌గా వేరొక‌రికి తెలియ‌ద‌ని చెబుతుంటారు. ముంద‌స్తు ఎన్నిక‌లు అంటూ స‌రికొత్త వ్యూహంతో ప‌రుగులు పెట్టించాడు. ఈ హ‌డావుడిలో అటు కాంగ్రెస్, ఇటు భాజ‌పా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి. ఏం చేయాలో పాలుపోని స‌న్నివేశం క‌లుగుతోందిట‌. ఇక‌పోతే కేసీఆర్ అసెంబ్లి ఎన్నిక‌లు, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రెండిటినీ దృష్టిలో పెట్టుకుని కొత్త ఆట ఆడుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న ద‌గ్గ‌ర ఎన్నిక‌ళ వ్య‌వ‌హారాన్ని, అవ‌స‌రాన్ని బ‌ట్టి ప్లాన్ ఏ, ప్లాన్ బి రెడీగా ఉన్నాయిట‌.

ప్లాన్ ఏ ప్ర‌కారం.. మ‌జ్లిస్‌తో పొత్తు కుదుర్చుకుని అసెంబ్లి ఎన్నిక‌ల్లో ముందుకు సాగాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌. అదే పార్ల‌మెంట్‌ ఎల‌క్ష‌న్స్ వేళ‌ భాజ‌పాతో క‌లిసి ముందుకెళ్లాల‌ని తీర్మానించార‌ట‌. ఆ ప్ర‌కారమే ఇటీవ‌ల అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించారు. ప్లాన్ ఏలో భాగంగా మజ్లిస్ పోటీచేసే ఏడు స్థానాల్లో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదు. ప్లాన్ బి ప్ర‌కారం.. ఎంపీ ఎన్నిక‌ల్లో భాజ‌పాతో క‌లిసి పోటీ చేసేందుకు కొన్ని స్థానాల్ని ఆ పార్టీకి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకునే ఆలోచ‌న ఉంది. అలా కేంద్రంలో భాజ‌పాతో అంట‌కాగుతూ స్థానికంగా ఝ‌ల‌క్ ఇస్తారు. స్థానికంగా మ‌జ్లిస్‌కి స్నేహ‌హ‌స్తం ఇచ్చి, ఆ పార్టీకి బ‌ద్ధ వ్య‌తిరేకి అయిన భాజ‌పాకి హ్యాండిస్తారు. ఎన్నిక‌ల వేళ సీట్ల పంప‌కం ద‌గ్గ‌ర పొత్తులు కుదురుతాయి కాబ‌ట్టి ఆ మేర‌కు కేసీఆర్ పాచిక‌ల్ని తెలివిగా క‌దుపుతున్నార‌ని ముచ్చటించుకుంటున్నారు. మజ్లిస్ పోటీచేసే స్థానాలు, బీజేపీ నేతల స్థానాల్లోనూ తేరాస అభ్యర్థులను ప్రకటించక‌పోవ‌డం వెన‌క ఎంత లాజిక్ ఉందో ఇప్పుడ‌ర్థ‌మైందా?

  •  
  •  
  •  
  •  

Comments