థర్డ్ ఫ్రంట్.. చంద్రబాబుతో కూడా మాట్లాడతా: కేసీఆర్

Monday, April 30th, 2018, 10:25:30 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త రాజకీయ ఆలోచనలు ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్ అనంతరం మంచి నేతగా అన్ని రాష్ట్రాల నేతలతో గుర్తింపు అందుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై ప్రత్యేక ద్రుష్టి సాధించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన ఇతర రాష్ట్రాల పార్టీలతో మద్దతు అందుకుంటున్నారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపి వారి మద్దతు అందుకున్న కేసీఆర్ రీసెంట్ గా తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే సపోర్ట్ కూడా అందుకున్నారు.

డీఎంకే ప్రధాన కార్యదర్శి స్టాలిన్ కూడా కేసీఆర్ ప్రణాళికలకు మద్దతు పలికారు. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశంలో అన్ని రంగంలో మార్పు జరుగుతందన్న భావనతో కేసీఆర్ ఆలోచనలకు సపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పారు. విద్యా, వైద్యం అలాగే వ్యవసాయ రంగంలో అభివృద్ధి జరిగే విధంగా థర్డ్ ఫ్రంట్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కేసీఆర్ చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా రైతులకు సపోర్ట్ చేసే విధంగా ముందుకు వెళతామని చెప్పారు. ఇక థర్డ్ ఫ్రంట్ లో మద్దతు కొరకు చంద్రబాబుతో కూడా చర్చలు జరుపుతామని కేసీఆర్ తెలిపారు. ఇటీవల చంద్రబాబు బీజేపీ పై అసంతృప్తితో ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు – కేసీఆర్ కలుసుకొని చాలా కాలమవుతోంది. ఓటుకు నోటు వివాదం వారి మధ్య దూరాన్ని చాలానే పెంచింది. మరి బాబు కేసీఆర్ కు ఎంత వరకు సపోర్ట్ చేస్తారనేది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments