కేసీఆర్ ఫ్రంట్ లో ప్రకాష్ రాజ్ కీలకపాత్ర?

Monday, April 16th, 2018, 12:59:25 PM IST

గత కొంత కాలంగా బీజేపీ పాలనపై తనదైనా శైలిలో విమర్శలు చేస్తోన్న నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు రాజకియ నేతలతో కూడా సన్నిహితంగా ఉంటున్నారు, కర్ణాటక స్థానిక రాజకీయ నేతలతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే తమిళ నాడులో కూడా రాజకీయ నేతలతో ఆయన ముందు నుంచి క్లోజ్ గానే ఉంటున్నారు. నటుడిగానే కాకుండా ఎప్పటికప్పుడు సమస్యలపై తన గొంతును వినిపిస్తున్నారు. అయితే ఈ మధ్య ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ చేస్తోన్న కృషి గట్టిగానే ఉంది. ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రల రాజకీయ నాయకులతో స్నేహాన్ని పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ కు అలాగే బీజేపీ అదిష్టానాలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుపుకుంటూ పోతున్నారు.

అయితే ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ప్రకాష్ రాజ్ కీలకంగా వ్యవహరించిననున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు మద్దతుగా అయన కొంత మంది నేతలతో చర్చలు జరిపించనున్నారట. ఇటీవల దేవెగౌడతో ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ చర్చలు జరపడానికి కారణం ప్రకాష్ రాజ్ ముఖ్య కారణమని తెలుస్తోంది. అప్పుడే కేసీఆర్ ప్రకాష్ రాజ్ తన క్లోజ్ ఫ్రెండ్ అని సంబోధించారు. ఇక తమిళ నేతలతో కూడా ప్రకాష్ రాజ్ కు సాన్నిహిత్యం ఉండడంతో వారిని కూడా కేసీఆర్ కు మద్దతు ఇచ్చే విధంగా వర్క్ చేయనున్నారని టాక్. అవసరమైతే తెలంగాణాలో ప్రకాష్ రాజ్ ను కేసీఆర్ ఎన్నికల బరిలో దింపడానికి రెడీ అవుతారట. లేకుంటే కర్ణాటక ఎన్నికలో ప్రకాష్ రాజ్ ఎమ్మెల్యే పదవి దిశగా పోటీ చేసే మార్గం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రకాష్ రాజ్ కేసీఆర్ కు ఏ స్థాయిలో ఉపయోగపడతారో చూడాలి.