హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు కసరత్తు

Wednesday, October 15th, 2014, 08:22:52 PM IST

kcr13
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల హుస్సేన్ సాగర్ పై ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ గౌరవాన్ని పెంచే విధంగా హుస్సేన్ సాగర్ ఉండాలి గాని, మురికి కూపంలా మారి అవమానకరంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. అలాగే ఎట్టి పరిస్థితులలోనూ హుస్సేన్ సాగర్ ను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని, సాగర్ పరిధిలోని భూములు కాపాడేందుకు కఠినంగా వ్యవహరిస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ 1562లో హుస్సేన్ సాగర్ మంచి నీరు అందిచేదని, ఇప్పుడు ఇలా మురికి కూపంగా మారడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మురికి నీరు హుస్సేన్ సాగర్ లో కలవకుండా అడ్డుకోవాలని, గణేశ్ నిమర్జనం వలన రసాయనాలతో అది కలుషితం అవుతోందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఇక దీనికి ప్రత్యామ్నాయంగా ఇందిరా పార్కులో సరస్సు నిర్మించే ప్రతిపాదన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే హుస్సేన్ సాగర్ ప్రక్షాళనతోనే తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ మొదలు కావాలని, సాగర్ ప్రక్షలనపై హైదరాబాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.